సీనియర్ రచయిత,నటుడు కాశీవిశ్వనాథ్ మృతి..
- December 22, 2015
ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాథ్ మరణించారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖపట్నం వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాశీ విశ్వనాథ్ మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్నట్లు తెలిసింది. దాదాపు 70 సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయ బాపినీడు తదితరుల సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి, మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, అనూప్ రూబెన్స్ తల్లి, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, విలక్షణ నటుడు, హీరో రంగనాథ్, నృత్యదర్శకుడు భరత్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









