రైతు రుణాలు చెల్లించిన అమితాబ్
- November 21, 2018
ముంబై: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు రైతులకు సంబంధించిన రుణాలను ప్రముఖ నటుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. మొత్తం 1398 మంది రైతులకు ఉన్న రుణాలను ఆయన బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకుల నుంచి ఈవేురకు అందిన లేఖలను తీసుకోడానికి 70 మంది ఎంపిక చేసిన రైతులకు ప్రయాణ ఏర్పాట్లు కూడా తాను స్వయంగా చేసినట్లు సోమవారం అర్ధరాత్రి తర్వాత రాసిన బ్లాగ్ స్పాట్‌లో అమితాబ్ బచ్చన్ (76) తెలిపారు. గతంలో కూడా 350 మంది రైతుల కుటుంబాలకు వారి రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా అమితాబ్ సాయం చేశారు. కనీసం కొంతమంది రైతులకు ఉన్న కష్టాలను తీర్చగలిగినా ఎంతో సంతోషంగా ఉంటుందని, ఇంతకుముందు మహారాష్ట్రలోని 350 మంది రైతుల రుణాలు తీరిస్తే, ఇప్పుడు యూపీలో 1398 మంది రైతులకు ఉన్న రూ. 4.05 కోట్ల రుణాలు తీర్చగలిగానని అమితాబ్ తెలిపారు. ఇలాంటి బృహత్కార్యం తలపెట్టి, అది పూర్తి చేసినపుడు దానివల్ల కలిగే ఆత్మశాంతి అనిర్వచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







