తొలి టీ20లో భారత్‌ ఓటమి

- November 21, 2018 , by Maagulf
తొలి టీ20లో భారత్‌ ఓటమి

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(4), ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) నిరాశపరిచారు. దినేశ్‌ కార్తీక్‌ (30), రిషభ్‌ పంత్‌ (20) పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 17 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ కు 174 పరుగుల లక్షాన్ని విధించారు యంపైర్లు. అయితే లక్ష ఛేదనలో భారత్ 169 పరుగులు మాత్రమే చేసింది. మరో 4 పరుగులు చేస్తే విజయం భారత్ ను వరించేది. ఆడమ్‌ జంపా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com