సూపర్‌ సేల్‌ రేపట్నుంచే: దుబాయ్‌లోని మాల్స్‌లో 90 శాతం వరకు డిస్కౌంట్‌

- November 21, 2018 , by Maagulf
సూపర్‌ సేల్‌ రేపట్నుంచే: దుబాయ్‌లోని మాల్స్‌లో 90 శాతం వరకు డిస్కౌంట్‌

దుబాయ్‌:దుబాయ్‌లోని మాల్స్‌లో ప్రముఖ బ్రాండ్స్‌పై 90 శాతం వరకు డిస్కౌంట్‌ పొందేందుకు వీలు కల్పిస్తూ దుబాయ్‌ సూపర్‌ సేల్‌ దూసుకొచ్చేసింది. నవంబర్‌ 22 నుంచి 3 రోజులపాటు ఈ సేల్‌ అందుబాటులో వుంటుంది. మాజిద్‌ ఫుత్తైమ్స్‌ ఔట్‌లెట్స్‌లో ఈ ఆఫర్‌ని పొందవచ్చు. మాల్‌ ఆఫ్‌ ది ఎమిరేట్స్‌, సిటీ సెంటర్స్‌ డేరా, మిర్దిఫ్‌, మెఐసామ్‌, అల్‌ షిందగ, మై సిటీ సెంటర్‌ అల్‌ బర్షాల్లోని ఔట్‌లెట్స్‌ ఈ ఆఫర్స్‌ని అందిస్తున్నాయి. 25 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో బ్రాండెడ్‌ ఉత్పత్తులు అందుబాటులో వుండటంతో, షాపింగ్‌ ప్రియులు ఈ సేల్‌ పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ఈ మూడు రోజులపాటు ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని విజిటర్స్‌కి కల్పిస్తారు. హ్యాండ్స్‌ ఫ్రీ షాపింగ్‌ సర్వీస్‌ని కూడా అందుబాటులో వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com