'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్ విడుదల
- November 21, 2018
హైదరాబాద్: అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిన్మాలో సుమంత్ కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తుంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్ విడుదల చేసింది. నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటించిన సుమంత్.. భక్తి ముసుగులో జరిగే మోసాల్ని వెతికిపట్టే పనిలో పడ్డాడు. దేవుడంటే నమ్మకం లేని హీరో.. సుబ్రహ్మణ్యపురం అనే ఊరికోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? దేవుడి ముసుగులో ఉన్న దుష్టశక్తులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లే ఇందులో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్ అని సాయికుమార్ అడుగగా.. ఆ గుడిలో జరుగుతున్న మర్మాన్ని బయట పెడుతున్నాడు కార్తీక్.
మేమంతా ఆ భగవంతుడ్ని సెర్చ్ చేస్తాం..నువ్వేమో ఆ భగవంతుడిపైనే రీసెర్చ్ చేస్తున్నావ్ అని పూజారి పలికిన సంభాషనలతోపాటు, దేవుడి మహిమాౌలేక మానవుడి మేథస్సా చూద్దాం అంటూ సుమంత్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి హారర్, థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు. హీరో సుమంత్ ఈ సినిమాతో మంచి విజయాన్నిఅందుకోవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







