ట్విటర్ సీఈవోపై చర్యలుంటాయి: హోంమంత్రి

- November 22, 2018 , by Maagulf
ట్విటర్ సీఈవోపై చర్యలుంటాయి: హోంమంత్రి

రెచ్చగొట్టే విధంగా పోస్టర్ ను ప్రదర్శించిన ట్విటర్ సీఈవో జాక్ డోర్సేపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తన శాఖ అధికారులు డోర్సేతో మాట్లాడారని అన్నారు. ఇటీవల భారత్ లో పర్యటించిన డోర్సే.. పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫోటో దిగుతూ 'బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి' అని రాసిన పోస్టర్ ను ప్రదర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com