ఫ్రాన్స్‌లో ఘోరం..హోంవర్క్ చేయడం లేదని చంపేశారు!
- November 22, 2018
ఫ్రాన్స్‌లో ఘోరం జరిగింది. హోంవర్క్ చేయడం లేదని తొమ్మిదేళ్ల బాలుడిని చితకబాదడంతో అతడు ప్రాణాలు వదిలాడు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ముల్ హౌజ్ పట్టణంలో నివాసం ఉంటున్న తొమ్మిదేళ్ల బాలుడు హోంవర్క్ చేయనని మారం చేయడంతో.. అతని అక్క, అన్న తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అతని అన్న స్నేహితురాలు కూడా అక్కడే ఉంది. దెబ్బలకు తాళలేక ఆ అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అత్యవసర సేవల కోసం కాల్ చేసినా లాభం లేకుండా పోయిందని నిందితులు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాలుడి తల్లితో సహా నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన సమయంలో బాలుడి తల్లి అక్కడ లేదు. అయినా విచారణ నిమిత్తం ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







