తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సోనియా గాంధీ

- November 22, 2018 , by Maagulf
తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సోనియా గాంధీ

తెలంగాణ:సోనియా గాంధీ తొలిసారిగా.. తెలంగాణకు రానుడంటం.. అందులోను రాహుల్ తో క‌లిసి వ‌స్తుండ‌టంతో.. ఈ టూర్ ను కాంగ్రెస్ ప్ర‌తిష్ట‌త్మ‌కంగా తీసుకుంది. ఈ ప‌ర్య‌ట‌నను గ్రాండ్ స‌క్సెస్ చేసి.. ప్ర‌చారంలో గులాబీ బాస్ పై అప్ప‌ర్ హ్యాండ్ సాదించాలని ఉవ్వీళ్ళూరుతుంది హ‌స్తం పార్టీ.

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా, ఇప్పుడు పార్టీ అధినాయకత్వమే రంగంలోకి దిగుతోంది. ఈ క్రమంలో పార్టీ అధ్యకుడు రాహుల్‌ గాంధీ, మాజీ అధ్యకురాలు సోనియాగాంధీ తెలంగాణాకు వస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం 5 గంట‌ల‌కు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు సోనియా, రాహుల్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌కు వచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బహిరంగసభకు భారీగా జనసమీకరణ చేసే బాధ్యతను జిల్లాల వారీగా నాయకులకు అప్పగించింది. ఈ సభ ద్వారా పార్టీ సత్తాను టీఆర్ఎస్‌కు చాాటాలన్న లక్యంతో హస్తం నాయకత్వం సోనియా టూర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మేడ్చల్ బహిరంగసభలో ప్రధాన ఆకర్షణగా సోనియాగాంధీ నిలవనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక సోనియాగాంధీ హస్తముందనే వాదనల నేపథ్యంలో సోనియా రాక కచ్చితంగా తమకు కలసి వస్తుంన్నది హస్తం పార్టీ భావన. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ తొలిసారి వస్తుండడంతో, ఆమె ఏం మాట్లాడతారన్నది ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కృషి, టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, రైతు సమస్యలపై సోనియాగాంధీ ప్రసంగించే అవకాశముందని సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తమకు ఓ అవకాశమివ్వాలని ప్రజలకు సోనియా విజప్తి చేయనున్నారు.

రాహుల్‌గాంధీ ప్రసంగంపై కూాడా కాంగ్రెెస్ అభ్యర్థులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన రాహుల్ గాంధీ మీటింగ్‌ విజయవంతం కావడమే కాకుండా, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచింది. ఇప్పుడు మరో సారి రాహుల్, తెలంగాణాకు రావడం కచ్చితంగా తమకు కలసి వస్తుందని, పార్టీలో నూతనోత్తేజం పెంచుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.

తొలిసారిగా తెలంగాణాకు వస్తున్న సోనియాగాంధీని తెలంగాణ పౌర స‌మాజం ఘ‌నంగా స‌న్మానించ‌నుంది. ప్రజా కూటమి నాయకులు కోదండ‌రాం, ఎల్ ర‌మ‌ణ‌, చాడా వెంక‌ట్ రెడ్డిలు కూడా సోనియా సభలో పాల్గొననున్నారు. అందరూ కలసి ఎన్నిక‌ల ఉమ్మ‌డి ప్ర‌చారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, సోనియాగాంధీ చేతుల మీదుగా. కాంగ్రెస్ పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com