పంజాబ్ మంత్రి సిద్ధూకి ఆహ్వానం పంపిన ఇమ్రాన్
- November 24, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నుంచి మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి ఆహ్వానం అందింది. ఈనెల 28న భారత్-పాకిస్థాన్ బోర్డర్ కు చేరువగా నిర్మించబోతున్న కర్తార్‌పుర్ సాహిబ్ కారిడార్ శంకుస్థాపనకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు దేశాల్లోని జరగబోతున్న కారిడార్ నిర్మాణానికి ఈ నెల 26న భారత్‌వైపు పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శంకుస్థాపన చేస్తున్నారు. పాక్‌వైపు 28న ఇమ్రాన్‌ఖాన్ పునాదిరాయి వేయనున్నారు. రెండు దేశాల్లో పనులు పూర్తయితే వచ్చే ఏడాది నవంబరులో గురునానక్ 550వ జయంతి నాటికి భారతదేశ సిక్కులు- గురుద్వారా నానక్ సాహిబ్‌లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైనప్పుడు ఈ అంశాన్ని గుర్తుచేశారు.దాంతో కర్తార్ పుర్ కారిడార్ కు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









