క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి
- November 24, 2018
ఖైబర్: పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు తీవ్ర హింసగా మారింది. ఆ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో జరిగింది. అబోటాబాద్ జిల్లాలోని ఓ పోలీసు పోస్టు వద్ద రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఆ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. అక్కడ రెండు వర్గాలకు చెందిన వారు ఆయుధాలతోనే పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్‌ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







