ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో బహరేన్ లో ఎన్నికల ప్రచారం.!
- November 24, 2018
ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో బహరేన్ లో ఎన్నికల ప్రచారం... మోసపోతే గోస పడతాం.
తెరాస అభ్యర్థులను గెలిపించాలని బహరేన్ తెలుగు గల్లీ లో ఎన్నికల ప్రచారం నిర్వహిచడం జరిగింది .ఎన్నారై తెరాస బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ మరియు ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ 60 ఏండ్లు అధికారంలో ఉండి ఇటు గల్ఫ్ దేశంలో ఉండే తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదు అటు ప్రజల కష్టాలను పట్టించుకోలేరు గల్ఫ్ కు పోవడానికి కారణం కాంగ్రెస్ , టీడీపీ పార్టీలే మహాకూటమి నాయకులూ చెప్పే మాయమాటలు ను నమ్మకండి రాష్ట్రాన్ని కూటమికి అప్పగిస్తే రాష్టాన్ని కుంటలో తొక్కేస్తారు 60 ఏండ్ల లో చేయని అభివృద్ధి నాలుగున్నర ఏండ్ల లో చేసి చూపించారు మన సీఎం.కెసిఆర్ గారు దేశ రాజకీయాల్లో సీఎం.కెసిఆర్ గారు బాహుబలి వంటివారు తెరాస పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధర్యం,సత్తా లేక మహాకూటమి పేరుతో జట్టు కట్టుకున్నారు. దేశంలో ఏ రాష్టం లోను అమలు చేయని రీతిలో సీఎం.కెసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ,గల్ఫ్ లో ఉంటున్న అన్నదమ్ములకు ఏకంగా 50 కోట్లు కేటాయిచారు భారత దేశంలోనే ఆదర్శం గత 2014 ఎన్నికల్లో ప్రకటిచ్చినా మేనిపెస్టో వంద శాతం పూర్తి చేసిన ఘనత కెసిఆర్ మాత్రమే . ఇప్పుడు మనకు మంచి సమయం కూటమి కుట్రలను తిప్పికొట్టే సమయం వచ్చింది కూటమి నాయకులూ ఓట్లకోశం ఇంటి కొస్తే 60 ఏండ్లు ఏంచేశారని ఇప్పుడు ఎం చేస్తారని ఎం మొకం పెట్టుకొని వచ్చారని నిలదిచి అడగాలన్నారు. అమాయకులైన ప్రజలకు మాయ మాటలు చెప్పి మరో సారి మోసం చేయడానికి కలిసి వస్తున్నారు వారు చెప్పే మాయమాటలకు లొంగీ మోసపోతే గోసపడతాం మల్లి మన రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు . నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరే కెసిఆర్ కు కారు గుర్తుకు ఓటు వేసి కూటమి గువ్వా గువ్వు మానుపిచాలని కోరారు.గల్ఫ్ దేశం అయిన బహరేన్ దేశంలో "గల్ఫ్ లో టీఆర్ఎస్ "అనే నినాదం తో విస్తృతంగా సాగుతున్న టీఆర్ఎస్ ప్రచారం.

ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో క్యాంప్ లో ఎలక్షన్ కాంపెయిన్ నిర్వహించడం జరిగింది.
గల్ఫ్ కార్మికులు అందరూ మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారు కావాలనీ తమ పూర్తి మద్దతు తెలియ జేశారు.రాబోయే ఎలెక్షన్లో తమ నియోజకవర్గంలో గల్ఫ్ కార్మికుల విదేశాల్లో నుంచి TRSMISSION Call campaigning ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ విధంగా మద్ధతు తెలపాలని మరియు ఈ యొక్క కాలింగ్ ప్రక్రియ ను ఏ విధంగా చేయాలో వివరించడం జరిగింది .కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుముళ్ల, సెక్రెటరీలు విజయ్ ఉండింటి, ప్రమోద్ బొలిశెట్టి, జాయింట్ సెక్రటరీ నేరెళ్ల రాజు, సాయన్న కొత్తూరు, రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బాజన్న, నర్సయ్య తలరి, గణేష్ నుకాల,మోసిస్ తదితరులు పాల్గొన్నారు.
ఎం. వాసుదేవరావు
(మాగల్ఫ్ ప్రతినిధి),
బహరేన్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







