తీవ్రస్థాయికి చేరిన పెట్రోధరలపై ఆందోళనలు
- November 24, 2018
పారిస్: ఫ్రాన్స్‌లో పెట్రోధరలపై వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఆందోళనల్లో వాహన డ్రైవర్లు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు పాల్గొంటున్నాయి. 'ఎల్లో వెస్ట్'ల పేరుతో జరుగుతున్న ఆందోళనల్లో నేడు ఏడుగురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. పెట్రో ధరలపై పన్నులను తగ్గించాలంటూ ఈ ఆందోళనలను చేపట్టారు. ఒక్క పారిస్‌లో జరిగిన ఆందోళనల్లోనే దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి గ్రెనేడ్ పట్టుకొని అధ్యక్షభవనం వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో దేశ అధ్యక్ష భవనం వద్ద ఆందోళనలు చేయడాన్ని నివారిస్తూ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







