ఫ్రాన్స్‌లో రాఫెల్ ఒప్పందం కలకలం

- November 25, 2018 , by Maagulf
ఫ్రాన్స్‌లో రాఫెల్ ఒప్పందం కలకలం

ఫ్రాన్స్:రాఫెల్ ఒప్పందంపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో మరో కలకలం చోటు చేసుకుంది.రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి షెర్పా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.ఈ సంస్థ ఆర్థిక నేరాలపై పోరాడే స్వచ్ఛంద సంస్థ, పౌర సమాజ బృందం. ఏ నిబంధనల ప్రకారం భారతదేశానికి దసో కంపెనీ 36 రాఫెల్‌ జెట్‌ విమానాలను అమ్మిందో, రిలయన్స్‌ను తన భాగస్వామిగా ఎలా ఎంచుకుందో వివరణ ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. ఈ ఒప్పందానికి సంబంధించి అవినీతి, అనుచిత ప్రయోజనాలు చేకూర్చడం, ప్రభావితం చేయడం, మనీలాండరింగ్‌ వంటి అంశాలపై దర్యాప్తు జరపాలని సూచించింది. ఈ ఫిర్యాదు గురించి ఫ్రాన్స్‌కు చెందిన మీడియా పార్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. రాఫెల్ ఒప్పంద వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమంటూ షెర్పా వ్యవస్థాపకుడు విలియం బోర్డన్‌ వ్యాఖ్యానించినట్టు మీడియా పార్ట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com