బాలీవుడ్:‘అర్జున్ రెడ్డి’ సెకండ్ లుక్
- November 25, 2018
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈసినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమాలో షాహిద్ కపూర్‌కు సంబంధించిన రఫ్ లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
షాహిద్ గుబురు గడ్డంతో ఉన్న స్టిల్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా మరో లుక్కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. సినిమాలో కాలేజ్‌కు సంబంధించిన సీన్స్‌లో షాహిద్ క్లీన్ షేవ్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. క్లీన్ షేవ్‌తో ఇంటెన్స్‌గా కనిపిస్తున్న షాహిద్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







