ఇండోనేషియా:భారత పైలెట్ మృతదేహం లభ్యం
- November 25, 2018
ఇండోనేషియా:గతనెల 29న ఇండొనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన భారత పైలెట్ భవ్యే సునేజా మృత దేహం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అక్కడి అధికారులు పైలెట్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందచేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. భవ్వే సునేజా మరణంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. గత నెలలో జకార్తా నుంచి బ్యాంగ్ కా ద్వీపానికి వెళుతున్న లయన్ ఎయిర్ కు చెందిన విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 189 మంది ప్రయాణికులు మరణించగా, ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల భవ్యే సునేజా విమాన పైలెట్ గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







