లహరి చేతికి 'ఎన్టీఆర్ ' ఆడియో హక్కులు
- November 26, 2018
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో 'ఎన్టీఆర్' బయోపిక్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ , నిర్మిస్తున్న ఈ మూవీ ఫై యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్..కథానాయకుడు' పేరుతో , రాజకీయ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్ - మహానాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి కానుకగామొదటి భాగాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఎన్నో విషయాలు బయటకు రాగా , తాజాగా ఈ బయోపిక్ ఆడియో రైట్స్ కు సంబందించిన వార్త బయటకు వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి సంబందించిన ఆడియో రైట్స్ ను భారీ రేటుకు లహరి మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. గతంలో కీరవాణి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'గాండీవం', 'బొబ్బిలి సింహం' 'పాండురంగడు' వంటి సినిమాలు మ్యూజికల్‌గా మంచి విజయాలే సాధించాయి. ఇపుడు ఈ బయోపిక్ కూడా అలాగే విజయం బాట వేస్తుందని అంత నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







