ఇరాన్:ట్రంప్ వ్యతిరేక నిరసనలు

- November 26, 2018 , by Maagulf
ఇరాన్:ట్రంప్ వ్యతిరేక నిరసనలు

టెహ్రాన్‌: ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. టెహ్రాన్‌ వీధుల్లోకి వందలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. అమెరికాను భూస్థాపితం చేస్తామంటూ నినదించారు. అమెరికా జాతీయపతాకానికి నిప్పంటించి నిరసన తెలిపారు. కాగా, ఉగ్రసంస్థలకు ఇరాన్‌ స్వర్గధామంగా మారిందని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ వైఖరి కారణంగానే తాము అణు ఒప్పందం నుంచి వైదొలిగినట్టు ట్రంప్‌ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేగాకుండా, ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పలు ఆంక్షలు విధించారు. తమ మిత్రదేశాలెవరూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని, ఒకవేళ కొనుగోలు చేసినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో, పలు దేశాలు ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. 
ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ట్రంప్‌ వ్యతిరేక నిరసనలు భగ్గుమంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com