లహరి చేతికి 'ఎన్టీఆర్ ' ఆడియో హక్కులు

- November 26, 2018 , by Maagulf
లహరి చేతికి 'ఎన్టీఆర్ ' ఆడియో హక్కులు

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో 'ఎన్టీఆర్' బయోపిక్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ , నిర్మిస్తున్న ఈ మూవీ ఫై యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్..కథానాయకుడు' పేరుతో , రాజకీయ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్ - మహానాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి కానుకగామొదటి భాగాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఎన్నో విషయాలు బయటకు రాగా , తాజాగా ఈ బయోపిక్ ఆడియో రైట్స్ కు సంబందించిన వార్త బయటకు వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి సంబందించిన ఆడియో రైట్స్ ను భారీ రేటుకు లహరి మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. గతంలో కీరవాణి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'గాండీవం', 'బొబ్బిలి సింహం' 'పాండురంగడు' వంటి సినిమాలు మ్యూజికల్‌గా మంచి విజయాలే సాధించాయి. ఇపుడు ఈ బయోపిక్ కూడా అలాగే విజయం బాట వేస్తుందని అంత నమ్ముతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com