మహేష్-సుకుమార్ సినిమా ముహూర్తం ఖరారు

- November 26, 2018 , by Maagulf
మహేష్-సుకుమార్ సినిమా ముహూర్తం ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విలన్ గా సాయికుమార్ కనిపించబోతున్నారు. పివిపి-దిల్ రాజు, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 5నమహర్షిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేశ్ మే నెల నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? తదితర పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com