వాట్సాప్:ఒక్క బటన్‌తో గ్రూప్ కాలింగ్
- November 26, 2018
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించే వాట్సాప్ ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్‌తో మందుకొచ్చింది. గ్రూప్ కాలింగ్‌లో అంతకుముందు ఎదురైన లోటుపాట్లను అధిగమించి సరికొత్త గ్రూప్ కాలింగ్‌ను తెర మీదకు తెచ్చింది. ఇంతకు మందు గ్రూప్ కాలింగ్ చేయాలంటే మెదట ఒకరికి కాల్ చేసి తర్వాత ఇతరులను కలుపుకొనేవారు. కానీ ఇప్పుడా బాధ తప్పనుంది.
గ్రూప్ చాట్‌లో ఒకే ''గ్రూప్ కాల్''బటన్‌తో ఏకకాలంలో ఎంపిక చేసిన వారిని కాల్లోకి తీసుకోవచ్చు. ఈ గ్రూప్ కాల్ బటన్‌ను ఉపయోగించి ఆడియో, వీడియో కాల్స్‌ను చేసుకునే వీలుంది. అంతేకాకుండా గ్రూప్‌లోని ముగ్గురితో ఒకేసారి చాట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ కాలింగ్‌లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.18.110.17లో ఈ సరికొత్త ఫీచర్‌ను ఇప్పటికే ఐఓస్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇంకా చేరువ కాలేదు. త్వరలోనే ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు పరిచయం చేయనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







