పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..

- November 26, 2018 , by Maagulf
పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా చిత్రం తీశారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..అయినప్పటికీ పూరి తన కుమారుడితో మరో చిత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి పూరి నిర్మాత మాత్రమే. అనిల్ దర్శకుడిగా ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నాడు పూరి. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ ద్వారా గాయత్రీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com