భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ

- November 27, 2018 , by Maagulf
భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ

22 ఏళ్ళ ఫిలిప్పినా మహిళ ఒకరు అజ్మన్‌లోని ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా షేక్‌ ఖలీఫా హాస్పిటల్‌ వైద్యులు ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఫిలిప్పీన్‌ కాన్సుల్‌ జనరల్‌ పాల్‌ రేమండ్‌ కోర్టెస్‌ చెప్పారు. మనీలాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌కి ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పేర్కొన్నారు కోర్టెస్‌. మృతదేహాన్ని రిపాట్రియేట్‌ చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అజ్మన్‌ అథారిటీస్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com