హాకీ ప్రపంచకప్‌లో సందడి చేయనున్న తారలు

- November 27, 2018 , by Maagulf
హాకీ ప్రపంచకప్‌లో సందడి చేయనున్న తారలు

పురుషుల హాకీ ప్రపంచకప్‌ భారత్ లో జరగనున్న విషయం తెలిసిందే. హాకీ ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే ఒడిషా సిద్ధమైంది. హాకీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు సందడి చేయనున్నారు. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహ్మాన్‌, మాధురీ దీక్షిత్‌లతో పాటు మరికొందరు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. భువనేశ్వర్‌లో మంగళవారం అట్టహాసంగా జరగనున్న ఓపెనింగ్ సెర్మనీలో మాధురీ దీక్షిత్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. బుధవారం కటక్‌లో జరిగే రెండో ఓపెనింగ్ సెర్మనీలో సల్మాన్ ఖాన్ పాల్గొననున్నారు. అయితే రెండు ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరి చేయనున్నారు.

హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. 16 జట్లు నాలుగు ఫూల్‌లుగా విడిపోయి.. 19రోజుల పాటు ఆడనున్నాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫూల్‌-ఏలో అర్జెంటీనా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌..

ఫూల్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, చైనా.. ఫూల్‌-సిలో బెల్జియం, భారత్‌, కెనడా, దక్షిణాఫ్రికా.. ఫూల్-డిలో నెదర్లాండ్స్‌, జర్మనీ, మలేషియా, పాకిస్థాన్‌లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com