నర్సులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- November 28, 2018
బెంగళూరు: ఓ వ్యక్తి 32 మంది నర్సులను జర్మన్ భాషలో శిక్షణ పేరిట అర్మేనియాకు తరలించేందుకు యత్నిస్తుండగా బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళూరుకు చెందిన టోనీ టామ్ నర్సులకు రెండు నెలలపాటు జర్మన్ భాషలో శిక్షణ తర్వాత జర్మనీ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 32 మంది నర్సులను అర్మేనియాకు తరలించేందుకు యత్నించాడు. నర్సులను అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి నర్సులను అక్రమ రవాణా చేస్తున్న టోనీటామ్ ను అరెస్టు చేసి 32 మంది నర్సులను కాపాడారు. అర్మేనియాలో జర్మన్ భాష నేర్పే విద్యాలయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు టోనీటామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







