జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను
- November 28, 2018
అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ , హలో చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం కొత్తగా , ఆసక్తిగా ఉండడం తో అభిమానులు సైతం ఈ సినిమా ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని , సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని చిత్ర మేకర్స్ చెపుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







