అమెరికాను హెచ్చరించిన వాతావరణ శాఖ
- November 28, 2018
మధ్య అమెరికాను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈశాన్య మిస్సోరి, మిచిగాన్, చికాగో ప్రాంతాల్లో భారీగా మంచు పడుతుండటంతో జనజీవనం స్థంభించింది. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వాణిజ్య, వ్యాపార, కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి.
ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంచుతోపాటు భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో ధ్యాంక్ గివింగ్ హాలిడే సందర్బంగా బయటకు రాకుండా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో చికాగోలో 13 అంగులాల మంచు కురిసిందని అధికారులు తెలిపారు. 3లక్షల 40వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోడ్లపై పెద్ద ఎత్తున మంచు కూరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తూ రాకపోకను పునరుద్ధరిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
కేన్సస్ మిస్సోరి, నెబ్రస్కాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఆరు నుంచి 10 అంగుళాల మందంలో మంచు కురిసింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. 16 వందల విమాన సర్వీసులు రద్దు కాగా, 15 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. షికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా 770 విమానాలు, కేన్సస్ సిటీ నుంచి 187, షికాగో మిడ్‌వే నుంచి 124 విమానాలు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు