యూఏఈ: 9 డిగ్రీలకు పడిపోయిన అత్యల్ప ఉష్ణోగ్రత

- November 28, 2018 , by Maagulf
యూఏఈ: 9 డిగ్రీలకు పడిపోయిన అత్యల్ప ఉష్ణోగ్రత

అరేబియన్‌ పెనుసులా మీదుగా హై ప్రెషర్‌ సిస్టమ్‌ కారణంగా, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తగ్గుదల స్థిరంగా వుండే అవకాశం వుంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు వాతావరణం స్టేబుల్‌గా వుంటుంది.. అక్కడక్కడా మేఘాలు, చిరు జల్లులు కురిసే అవకాశం వుంది. ఉదయం వేళల్లో ఫాగ్‌, మిస్ట్‌ కండిషన్స్‌ ఎదురవుతాయి. నార్త్‌ వెస్టర్లీ నుంచి నార్త్‌ ఈస్టర్లీ వైపు ఈ విండ్స్‌ గంటకు 38 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం వుంది. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్‌ యూఏఈలో నమోదయినట్లు ఎన్‌సిఎం వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com