భారీ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ 10 మంది
- November 28, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా లో జరిగిన ఓ భారీ అగ్ని ప్రమాదం నుంచి 10 మంది రెసిడెంట్స్ క్షేమంగా బయటపడ్డారు. అల్ ఉరైబి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. వాటర్, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 10 మందిని సివిల్ డిఫెన్స్ రక్షించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఉపయోగించాలనీ, ఈ విషయంలో ఎవరూ రాజీ పడకూడదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







