షార్జాలో 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ ప్రారంభం
- November 28, 2018
షార్జా:షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ప్రయాణీకుల సౌకర్యార్ధం 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ని ప్రారంభించింది. మొత్తం 172 బస్ షెల్టర్స్కి ఇదివరకే ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. మొత్తం 16 మిలియన్ దిర్హామ్లతో వీటిని నిర్మించనున్నారు. 28 ఇప్పటికే పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో వున్నాయి. అంతర్జాతీయ స్థాయి వసతులతో, సోలార్ పవర్డ్ బస్ స్టాప్స్గా వీటిని రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్ షెల్టర్స్ని ప్రారంభించనున్నట్లు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి చెప్పారు. అన్ని బస్ షెల్టర్స్ ఎల్ఇడి స్క్రీన్స్ కలిగి వుంటాయని, పబ్లిక్ బస్ రూట్స్కి సంబంధించి నెంబర్, టైమింగ్ అక్కడ డిస్ప్లే అవుతాయని ఎస్ఆర్టిఎ డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్అజీజ్ అల& జర్వాన్ చెప్పారు. కొత్త బస్ షెల్టర్స్ 10 నుంచి 15 మందికి ఒకేసారి అకామడేట్ చేయగలవు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇవి పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!