లేహంగాలో మెరిసిపోతున్న ఇషా అంబానీ!

- November 28, 2018 , by Maagulf
లేహంగాలో మెరిసిపోతున్న ఇషా అంబానీ!

ముంబై:పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్ళి సందడి అప్పుడే మెుదలైంది. వివాహ వేడుకలో ఇషా ధరంచాల్సిన డ్రెస్స్‌స్‌ను సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారు. తాజాగా అతను డిజైన్ చేసిన లెహెంగా దుస్తులను ధరించి ఇషా మెరిసిపోయింది. ఆమె ధరించిన లెహంగ దుస్తులతో ఉన్న ఫోటోను సవ్యసాచి ముఖర్జీ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెహంగతో పాటు అన్‌కట్‌ సిండికేట్‌ డైమండ్స్‌, జాంబియన్‌ ఎమరాల్డ్స్‌ పొదిగిన నెక్లెస్‌‌ను ధరించి ఇషా తళుక్కున మెరిసిపొతుంది. పోస్ట్ చేసిన గంటలోనే ఆ ఫోటోకు90వేల లైక్స్ లభించాయి. ఫోటోతో పాటు సవ్యసాచి కాప్షన్ కూడా జతచేశారు” వివాహానికి ముందు జరిగే గ్రహ శాంతి పూజా కోసం ఈ డ్రెస్ డిజైన్ చేశాము. డిసెంబరు 12న వివాహ కార్యక్రమం జరగనుంది. లేహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్‌ సిండికేట్‌ డైమండ్స్‌, జాంబియన్‌ ఎమరాల్డ్స్‌ పొదిగిన నెక్లెస్‌, దానికి జతగా మ్యాచింగ్‌ చెవి రింగులతో ఇషా తళుక్కున మెరిసిందన్నారు. ఈ ఫోటోకు తమదైన శైలిలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “చూడాదల్సిన అందాలు అన్నీ ఒక్కే వ్యక్తి”లో ఉన్నట్లు ఉందని ఓ నేటిజెన్ కామెంట్ చేయగా “ఈ దుస్తులలో ఇషా.. దీపిక కంటే అందంగా ఉంది” అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com