ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఫ్రీ వైఫై
- November 30, 2018
చైనా:జేబులో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ చేతిలో ఫోన్ లేకపోతే ముఖ్యంగా అందులో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎంత కష్టం. అంతగా కనెక్ట్ అయిపోయారు సామాన్యులు సైతం. ఊర్లో సరైన సదుపాయాలు లేకపోయినా ఊరంతటికీ వైఫై వచ్చేస్తుంది. నెలాఖరులో వచ్చే ఫోన్ బిల్లు చూసి బావురుమన్నా అది లేందే క్షణం గడవడం కష్టం.
నెట్ వర్క్ ఛార్జీలు, వైఫైల బిల్లులు కట్టే పనిలేకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత వైఫై సౌకర్యం ఉంటే.. ఇంక జనం నిద్రా, నీళ్లు మర్చిపోతారేమో. ఓ చైనా కంపెనీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. హాంకాంగ్‌కు చెందిన లింక్ష్యూర్ నెట్వర్క్ 272 ఉపగ్రహాల్ని రోదసీలోకి పంపి, వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉచిత వైఫై అందిస్తామని చెబుతోంది.
ఇప్పటికే గూగుల్, స్పేస్-ఎక్స్ సంస్థలు.. ఉపగ్రహాల ద్వారా ఉచిత వైఫై ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పుడు లింక్ష్యూర్ వాటికి పోటీకి వస్తోంది. దాదాపు రూ.3వేల కోట్లను ఈ ప్రయోగం కోసం వెచ్చిస్తారట. 2020 లోపు 10 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, 2026 కల్లా మొత్తం 272 ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తామని సంస్థ సీఈవో వాంగ్ జింగ్యింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







