భారత ప్రధాని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- November 30, 2018
జెడ్డా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అర్జెంటీనాలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సెక్యూరిటీ, ఎనర్జీ, ఇన్వెస్టిమెంట్స్ వంటి విభాగాలకు సంబంధించి ఇరువురి మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బ్యూనస్ ఎయిర్స్లో జి20 సమ్మిట్ కోసం ఈ ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. సౌదీ ఆయిల్ జెయింట్ అరామ్కో, భారతదేశంలో ఆయిల్ రిఫైనింగ్, ఆయిల్ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడుల అంశం, అలాగే భారతదేశపు ఆయిల్ మరియు పెట్రోలియం ప్రోడక్ట్స్ అవసరాల గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. అర్జెంటీనాలోని క్రౌన్ ప్రిన్స్ రెసిడెన్స్‌లో ఈ సమావేశం జరిగింది. సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఇరువురూ అంగీకారం తెలిపినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్లోకి సౌదీ అరేబియాని ప్రధాని ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..