మస్కట్‌లో ఇండియన్‌ నేవీ షిప్‌ ఐఎన్‌ఎస్‌ తరంగిణి

- November 30, 2018 , by Maagulf
మస్కట్‌లో ఇండియన్‌ నేవీ షిప్‌ ఐఎన్‌ఎస్‌ తరంగిణి

మస్కట్:భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ తరంగిణి నౌక, సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌లో కొలువుదీరింది. ఒమన్‌ యాచ్‌ట్‌ జీనత్‌ అల్‌ బహార్‌ పక్కనే ఐఎన్‌ఎస్‌ తరంగిణిని నిలిపారు. ఇండియన్‌ ఏషన్‌ నేవల్‌ సింపోజియం (ఐఓఎన్‌ఎస్‌)లో ఈ రెండు నౌకలు పాల్గొననున్నాయి. ఇండియన్‌ ఓసియన్‌ రీజియన్‌లోని దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఈ నావల్‌ ఎక్సర్‌సైజ్‌ని నిర్వహిస్తున్నారు. జీనత్‌ అల్‌ బహార్‌, సుల్తానేట్‌ తరఫున రిప్రెజెంట్‌ చేసేందుకు కోచికి గతంలో వెళ్ళింది. తిరిగి మస్కట్‌కి ఐఎన్‌ఎస్‌ తరంగిణితో కలిసి వచ్చింది. మస్కట్‌లో ఐఎన్‌ఎస్‌ తరంగిణి రెండు రోజులపాటు వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com