యూరప్ వీక్..సెన్సెక్స్ ఊగిసలాట!
- November 30, 2018
శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న రెండు రోజుల జీ20 దేశాల సమావేశాలపై కన్నేసిన ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. శనివారం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ఏర్పాటైన డిన్నర్ సందర్భంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాద అంశాలు చర్చకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, యూకే 0.6 శాతం చొప్పున క్షీణించి ట్రేడవుతున్నాయి.
లాభాల్లోకి
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో వెనకడుగువేశాయి. ఒక దశలో లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. ప్రస్తుతం కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు పుంజుకుని 36,198కు చేరింది. నిఫ్టీ సైతం 14 పాయింట్లు బలపడి 10,873 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఐటీ, ఫార్మా, ఆటో 2.2-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి.
బ్లూచిప్స్ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్, సిప్లా, విప్రో, ఐబీ హౌసింగ్, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, టీసీఎస్ 5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్, ఇన్‌ఫ్రాటెల్, యూపీఎల్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, వేదాంతా, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్ 4.4-1.2 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు ఊగిసలాట మధ్య కదులుతున్నప్పటికీ చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1221 లాభపడగా.. 1297 నష్టాలతో ట్రేడవుతున్నాయి
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!