డిసెంబర్ 9న ప్రారంభం కానున్న కన్నూర్ ఎయిర్పోర్టు
- November 30, 2018
నూతనంగా నిర్మించిన కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 9న పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించనున్నారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఎయిర్పోర్ట్ ఎండీ వీ తులసీదాస్ వెల్లడించారు. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ ఈ కొత్త ఎయిర్పోర్టును నిర్వహించనుంది. కన్నూర్ విమానాశ్రయం కోచి ఎయిర్పోర్టు తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కానుంది. 2,330 ఎకరాల విస్తీర్ణంలో కన్నూర్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టారు. రన్వే పొడవు 3,050 మీటర్లు. 10లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలందించనున్నట్లు అంచనా.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







