'వెలకమ్ జిందగీ' మూవీ ఫస్ట్ లుక్..
- December 01, 2018
శ్రీనివాస కళ్యాణ్ - పోద్దార్ లను హీరో-హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ నూతన నిర్మాణ సంస్థ `పిల్లర్ 9 ప్రొడక్షన్స్` నిర్మిస్తున్న మొదటి సినిమా `వెల్‌కం జిందగీ`. ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌కి శాలు - లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. చుట్టూ ఉన్న పదిమందికి సాయపడితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనందమే వేరు! అనేది కాన్సెప్ట్. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్‌కి అద్భుత స్పందన వచ్చిందని దర్శకనిర్మాతలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు శాలు- లక్ష్మణ్ మాట్లాడుతూ -"మనం చేసే చిన్న సాయం ఇతరుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను వివరించే చిత్రమే ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఇదో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. కొత్తవారే అయినా నాయకానాయికలు చక్కగా నటించారు. మధుమణి, కమల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వారి నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. జబర్ధస్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడుగా నటించాడు. తన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు. 5 విభిన్నమైన పాటలున్నాయి. గౌతమ్ రఘురామ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్రస్తుతం
నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ కి స్పందన బావుంది" అన్నారు. ఈ చిత్రానికి కథ-కథనం -దర్శకత్వం : శాలు- లక్ష్మణ్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







