బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ 9వ దీక్షా దివస్
- December 02, 2018
బహ్రెయిన్:బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అద్వర్యంలో తెలంగాణ 9వ దీక్షా దివస్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ బహరేన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ మరియు ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ గారు 2009 నవంబర్ 29న తనప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ వచ్చుడో కేసిఆర్ సచ్చుడో అంటూ ఆమరణ దీక్షకు దిగి ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. యావత్ తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి.. సకల జనులందరని ఉద్యమంలోకి తీసుకొచ్చిన కార్యదీశుడు కేసీఆర్ ని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉద్యమ రూపాలను మారుస్తూ. తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ వారి పదవులకు రాజీనామాలను చేసి చిన్నా..పెద్దా తేడాలేకుండా పార్టీలను మరియు తెలంగాణ బిడ్డలందరిని ఒకవేదికపైకి తీసుకొచ్చిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్ మలిదశ ఉద్యమ రథసారధి, ఉద్యమ దివిటీ, తెలంగాణ గాంధీ, ప్రియతమ నేత కేసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు నుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై నాందిపలికింది నాటి కేంద్రం ప్రభుత్వం, తెలంగాణ తీసుకొచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ గారికే దక్కుతుంది కాబట్టి ఇ దీక్ష దివస్ ప్రపంచచరిత్రలో మరిచిపోలేని రోజు 9 డిసెంబర్ అన్ని తెలిపారు.తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి తన పుట్టిన గడ్డ కు విముక్తి కోసం కెసిఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు కేంద్రం స్పందించి తొలిప్రకటన చేసిన రోజు... డిసెంబర్ 9 జై తెలంగాణ. దీక్ష చేపట్టిన దీక్ష దివాస్ లో మనం భాగస్వాములం అవుదాం ప్రభుతం అధికారికంగా చేయాలనీ కోరుకుందాం అంటూ ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుముళ్ల, సెక్రెటరీలు విజయ్ ఉండింటి, ప్రమోద్ బొలిశెట్టి, జాయింట్ సెక్రటరీ నేరెళ్ల రాజు, సాయన్న కొత్తూరు, రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బాజన్న, నర్సయ్య తలరి, గణేష్ నుకాల, మోసిస్ తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసు దేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..