హీరో కల్యాణ్‌రామ్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్
- December 03, 2018
హైదరాబాద్: కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా కేవీ గుహన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు '118' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కల్యాణ్‌రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలుగా నటించారు.
ఇదో ట్రెండీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని చిత్రబృందం వెల్లడించింది. జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు. కల్యాణ్‌రామ్ ఇటీవల 'నా నువ్వే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమన్నా కథానాయిక. జయేంద్ర దర్శకుడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







