బహ్రెయిన్ పార్లమెంట్‌కి యంగ్ లుక్
- December 03, 2018
బహ్రెయిన్:కొత్తగా పార్లమెంటుకు ఎంపికైనవారిలో ఎక్కువమంది యువత అలాగే మహిళలు వుండడంతో పార్లమెంటు కొత్త లుక్‌ని సంతరించుకోనుంది. గతంలో ముగ్గురు మహిళా పార్లమెంటేరియన్లు వుంటే, ఇప్పుడు వారి సంఖ్య 6కి చేరుకుంది. ఇప్పటిదాకా పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించినవారిలో పలువురు ఓటమి చవిచూశారు. కొత్తవారికి ఈసారి పార్లమెంటులో అవకాశం దక్కింది. ప్రజా ప్రతినిథుల తీరుతో అసంతృప్తితో వున్న బహ్రెయిన్ సమాజం, కొత్తవారి వైపు మొగ్గు చూపింది. పాతవారికి ఎక్కువగా ఇంటి ముఖం చూపించారు ఓ టర్లు. హేమాహేమీలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అలి అహ్మద్ అల్ జాయెద్, ఇసా అల్ ఖాధి, యూసుఫ్ జైనాల్, అబ్దుల్ నమి సల్మాన్ తదితరులు ఇంకోసారి విజయం సాధిస్తే, రువా అల్ హైకి, మొహమ్మద్ అల్ మారిఫి, మొహమ్మద్ అల్ అమ్మాది, అబ్దుల్రహ్మాన్ బుంజైద్, నాసర్ అల్ ఖసీర్, అలి అల్ అతిష్, ఇబ్రహీమ్ అల్ హమ్మాది, మొహమ్మద్ అల్ అహ్మద్, అబ్దుల్ రహ్మాన్ బు అలి తదితరులు ఓటమి పాలయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







