బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సెన్సార్ పూర్తి.. ‘U/A’ సర్టిఫికేట్..
- December 03, 2018
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ జంటగా నటించిన కవచం చిత్ర సెన్సార్ పూర్తయింది. ఎలాంటి కట్స్ లేకుండా ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ కవచంను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఈ మధ్యే విడుదలైన చిత్ర ట్రైలర్.. ఆడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుంది. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ సొంటినేని(నాని) కవచం సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్య
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







