'పేట్టా' మాస్ సాంగ్ అదుర్స్

- December 03, 2018 , by Maagulf
'పేట్టా' మాస్ సాంగ్ అదుర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాబోతున్న మరో మాస్ - యాక్షన్ ఎంటర్ టైనర్ 'పేట్టా'. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ మాస్ సాంగ్ ని వివేక్ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనిరుధ్ కలిసి పాడారు. ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది. సూపర్ స్టార్ అభిమానులకి కిక్కునిచ్చేలా ఉంది. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ఈ నెల 7న రాబోతుంది. ఇక, ఈ నెల 9న సినిమా ఆడియో వేడుక జరగనుంది.
రజనీ నటించిన కబాలి, కాలా సినిమాలు ఆయన అభిమానులని తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రెండు సినిమాల తర్వాత రజనీ నుంచి వచ్చిన రోబో 2.ఓ థియేటర్స్ లో అదరగొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ. 400కోట్లకి కలెక్ట్ చేసింది. మరో నెలరోజుల్లో రాబోతున్న రజనీ పేటా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com