మరో మల్టీప్లెక్స్ నిర్మించనున్న మహేష్‌

- December 04, 2018 , by Maagulf
మరో మల్టీప్లెక్స్ నిర్మించనున్న మహేష్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించడం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 2న సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ మల్టీ ప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత విలాస వంతమైన లగ్జరీ కాంప్లెక్స్ గా రూపొందిన ఈ కాంప్లెక్స్‌లో ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌ పీరియన్స్ పొందేలా తీర్చి దిద్దారు. ఇందులో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తొలిసారి మల్టీ ప్లెక్స్ వ్యాపార రంగంలోకి దిగిన మహేష్ దీని కోసం 80 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు. ఈ మల్టీ ప్లెక్స్ కు సంబంధించిన ఇంటీరియర్ వర్క్ ను మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఈమూవీ థియేటర్స్ లోని స్క్రీన్‌తో పాటు సౌండ్ క్వాలిటీ ప్రపంచ స్థాయిలో కనిపించింది. ముఖ్యంగా అద్భుతమైన ఇంటీరియర్‌ డిజైనింగ్ లుక్‌ ఈ 'ఏఎంబి సినిమాస్' ప్రత్యేకత. అయితే మహేష్ బాబు మరో భారీ మల్టీప్లెక్స్ థియేటర్‌ని హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్లాన్స్ వేస్తున్నట్టు సమాచారం.

సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తితో కలిసి మహేష్ తన కార్యాచరణ చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహేష్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com