వాట్సాప్: త్వరలో డార్క్ మోడ్

- December 04, 2018 , by Maagulf
వాట్సాప్: త్వరలో డార్క్ మోడ్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే ''డార్క్ మోడ్''. ఇప్పుడీ సెట్టింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. పైగా రాత్రి వేళల్లో వాట్సాప్ చూసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కళ్లకు పెద్దగా శ్రమ ఉండదు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వైట్‌ కలర్‌లో ఉంది. ఈ సెట్టింగ్ వచ్చాక బ్యాక్ గ్రౌండ్ కలర్ బ్లాక్‌లోకి మారిపోతుంది.

వాట్సాప్‌లో రాబోయే ఫీచర్ల గురించి ముందే చెప్పే డబ్లూఏ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని బయటపెట్టింది. వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ గురించి బీటా ఇన్ఫో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. డార్క్ మోడ్ గురించి చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ఈ ఫీచర్‌పై పని జరుగుతోందని, మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలని బీటా ఇన్ఫో ట్వీట్ చేసింది. కాగా ఈ ఏడాది వాట్సాప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టికర్స్, గ్రూప్ వీడియో కాలింగ్ తదితర ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు డార్క్ మోడ్ పై దృష్టిపెట్టింది. డార్క్ మోడ్ అనేది వాట్సాప్ యూజర్ల డ్రీమ్‌గా చెబుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com