సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న తొలి విమానం
- December 04, 2018
విజయవాడ: సింగపూర్ నుంచి తొలి విమానం గన్నవరం విమనాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో గన్నవరం రాగానే విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. సిబ్బంది వారికి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ సీఆర్డీఏ తరఫున అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను అందజేశారు. సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభం కావడం వల్ల తమ ప్రయాణానికి అనుకూలంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. గతంలో చెన్నై, బెంగుళూరు లేదా హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా ప్రయాస తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







