చమురు ఎగుమతులను అడ్డుకోలేరు:హసన్‌ రౌహని

- December 04, 2018 , by Maagulf
చమురు ఎగుమతులను అడ్డుకోలేరు:హసన్‌ రౌహని

జెనీవా : ఇరాన్‌ తన చమురును ఎగుమతి చేసుకోనివ్వకుండా అమెరికా ఆపలేదని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహని మంగళవారం స్పష్టం చేశారు. గల్ఫ్‌ గుండా వెళ్ళే ఇరాన్‌ చమురు ఎగుమతులను నిరోధిస్తే ఈ మార్గం గుండా వెళ్ళే అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ చమురు ఎగుమతులను జీరోకి తగ్గించాలనే లక్ష్యంతో ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌ క్షిపణి కార్యక్రమాన్ని, ప్రాంతీయ ప్రాబల్యాన్ని అణచివేసే ఉద్దేశ్యంతోనే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 'మా చమురును మేం ఎగుమతి చేసుకుంటున్నామనేది అమెరికా తెలుసుకోవాలి. మా ఎగుమతులను వారు అడ్డుకోలేరు.'' అని రౌహని టెలివిజన్‌లో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు వారు మా ఎగుమతులను అడ్డుకోవాలనుకుంటే ఇక ఆ రోజు నుండి పర్షియన్‌ గల్ఫ్‌ గుండా అసలు చమరే ఎగుమతి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో, అమెరికాతో ఇరాన్‌ ఆర్థిక సంబంధాలను దెబ్బ తీయడంలో అమెరికా విజయం సాధించలేదని ఆయన తెలిపారు. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇరాన్‌ ప్రభుత్వం వారి (అమెరికా) లక్ష్యమైనపుడు సమాజంలో వృద్ధులు, బలహీనులపై ఒత్తిడి తీసుకురారాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు ఇషాక్‌ జహంగిరి వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com