ఖతార్‌ పౌరుల కిడ్నాప్‌: అరబ్‌ పార్లమెంట్‌ ఖండన

- December 23, 2015 , by Maagulf
ఖతార్‌ పౌరుల కిడ్నాప్‌: అరబ్‌ పార్లమెంట్‌ ఖండన

అరబ్‌ పార్లమెంటు ఇరాక్‌లోని ఖతార్‌ పౌరుల కిడ్నాప్‌ని తీవ్రంగా ఖండించింది. ప్రెసిడెంట్‌ అహ్మద్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ జర్వాన్‌, ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాక్‌లో ఖతార్‌ పౌరుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. అల్‌ జర్వాన్‌, ఖతార్‌ పౌరుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరాక్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఖతార్‌, ఇరాక్‌ ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఉగ్రవాదాన్ని ఎవరూ సహించరాదని, ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి దేశం కృషి చేయాలని అల్‌ జర్వాన్‌ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com