అత్యాచారం: నిందితుడికి జీవిత ఖైదు

- December 05, 2018 , by Maagulf
అత్యాచారం: నిందితుడికి జీవిత ఖైదు

దుబాయ్‌లోని ఓ విల్లాలో ఓ వ్యక్తి, ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. కోర్టు రికార్డుల ప్రకారం 24 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఈజిప్ట్‌కి చెందిన 23 ఏళ్ళ మహిళను, తన బెడ్రూమ్‌లో లాక్‌ చేసి, ఆమెను దారుణంగా కొట్టి, ఆమెపై అత్యాచారానికి దిగాడు. ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్‌ కూడా చేశాడు నిందితుడు. ఈ నేపథ్యంలో నిందితుడిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించడం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జూన్‌ 4న ఈ ఘటన చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com