రెక్లెస్‌ డ్రైవింగ్‌: 36 మంది అరెస్ట్‌

- December 23, 2015 , by Maagulf
రెక్లెస్‌ డ్రైవింగ్‌: 36 మంది అరెస్ట్‌

షార్జా పోలీసులు 34 వాహనాలను సీజ్‌ చేశారు. వాహనాల్ని వేగంగా, రెక్లెస్‌గా నడుపుతుండడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్‌ చేసి, కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ మరియు పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అహ్మద్‌ బిన్‌ దర్విష్‌ మాట్లాడుతూ, రోడ్లపై వాహనాలతో స్టంట్లు చేస్తున్నారనీ, ఇది నిబంధనల ఉల్లంఘన అని చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఇంజన్లను మార్చడం, విపరీతమైన శబ్దం వచ్చేలా సాంకేతికంగా మార్పులు చేయడాన్ని గుర్తించినట్లు చెప్పారాయన. రోడ్లపై స్టంట్స్‌ చేయడం ద్వారా వాహనాలు నడిపేవారికే కాకుండా, రోడ్లపై వెళ్ళే ఇతరులకూ ప్రమాదకరమని ఆయన అన్నారు. విపరీతమైన శబ్దంతో వాహనాలు నడపడం వల్ల రోడ్లకు సమీపంలో నివసించేవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com