'RX 100'దర్శకుడు అజయ్ భూపతి ఇంట విషాదం!
- December 06, 2018
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యువ దర్శకులు ఒక్క చిత్రంతోనే తామేంటో నిరూపించుకుంటున్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి అంతా కొత్త నటులతో తీసిన 'ఆర్ ఎక్స్ 100' సూపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన ఈ చిత్రం మొదట కాంట్రవర్సీ వచ్చిన...థియేటర్లలో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో కలెక్షన్ల పరంగా పెట్టిన పెట్టుబడికి పదింతలు ఎక్కువ రాబట్టింది.
ఈ సంవత్సరం హిట్ చిత్రాల్లో 'ఆర్ ఎక్స్ 100' చేరిపోయింది. తాజాగా అజయ్‌భూపతి ఇంట విషాదం నెలకొంది. అజయ్‌భూపతి తండ్రి వేగేశ్న రామరాజు(54) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, రామరాజు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. అజయ్ భూపతిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. 11 రోజుల పాటు ఆత్రేయపురం స్వగ్రామంలో నిత్య కర్మల్లో అజయ్ భూపతి పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







