'అమ్మ' ఫస్ట్ లుక్ !
- December 05, 2018
హీరోయిన్ నిత్యామీనన్ అమ్మగా మారిన సంగతి తెలిసిందే. ఆమె దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'ది ఐరన్ లేడి'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్థంతి పురస్కరించుకొని ఈరోజు జయలలితగా నిత్యా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో అచ్చం అమ్మలా ఒదిగిపోయింది నిత్యా.
వాస్తవానికి జయ పాత్ర కోసం చాలా మందినే అనుకొన్నాడు దర్శకుడు ప్రియదర్శన్. నయనతార, త్రిష్.. తదితరుల పేర్లు జయ పాత్ర కోసం వినిపించారు. చివరకు ఆ అవకాశం నిత్యాకి దక్కింది. మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందగా నిత్యానే సంప్రదించిన సంగతి తెలిసిందే. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ కి దక్కింది. మహానటి ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కీర్తి సురేష్ కీర్తిని మరింతగా పెంచేసింది. మహానటిలో సావిత్రి పాత్రని మిస్ చేసుకొన్న నిత్య.. ఎన్ టీఆర్ బయోపిక్ లో సావిత్రిలో పాత్రలో కనిపించబోతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







